వినాయక చవితి వ్రత కథ - వినాయక చవితి పూజ - గణేశుడు అగ్రపూజనీయుడు
ఒకసారి, శివుని కుమారుడైన కుమారస్వామి, గణాధిపత్యము తనకు ఈయమని కోరినాడు. శివుడు పుత్రులిద్దరికీ పోటీ పెట్టినాడు. ‘మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుం’దన్నాడు. కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. గజాననుడు త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు నారాయణ మంత్రం జపించి, తన తల్లితండ్రులచుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసినాడు. నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు. మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యము లభించినది.