ఓంభక్తి ఆరాధన

పదహారు సోమవారాల వ్రత కథ - పదహారు సోమవారాల వ్రతం - గిరిజా కల్యాణం

అది విని పార్వతి ‘స్వామీ! ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించితిరి. దీని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగిరో వివరముగా తెలుపవలెను’ అని ప్రార్థించెను. అంత శివుడు వ్రత పూజాఫలమును చెప్ప నారంభించెను.
‘పార్వతీ! చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణ సంఘటన ఇంకను నాకు జ్ఞాపకము ఉన్నది. నేను నీకు పతికావలెను అను ఉద్దేశముతో నీవు ఘోరారణ్యములో తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు, సప్తఋషులు నావద్దకు వచ్చి ప్రభూ! నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమవతిని అనుగ్రహించ రాదా? ఆలస్యమెందులకు?’ అని ప్రార్థించిరి. నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని. నిన్ను సంబోధిస్తూ శివునకున్న అవలక్షణములన్నింటిని వర్ణిస్తూ ‘శివుడు విరూపి, అపవిత్రుడు. మొరటు వ్యక్తిని అతని నీవు వేరెవరిని నైనను వివాహ మాడరాదా?’ అని పరిహసించితిని. అంతట నీకు పట్టరాని కోపం వచ్చెను. కోపంలో కన్నులు ఎర్రబడి ‘శివనింద మహాపాపం; శివుడు లేనిచో నేను బ్రతుకలేను; వేరొకరిని కన్నెత్తి కూడా చూడను’ అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి. అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీముందు ప్రత్యక్షమయ్యాను. నీవు పదహారు సోమవారాల వ్రతమాచరించుటచే నీ కోరిక తీరినది. గిరిజా కల్యాణం అతి వైభవముగా దేవఋషుల గంధర్వుల సమ్ముఖంలో జరిగినది. ఈ విధముగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని‘ అన్నాడు పరమేశ్వరుడు.

అంతట పార్వతి కూడా సంతుష్టురాలై ’స్వామి! నాకునూ జ్ఞప్తికున్నది. అయినను ఆ వ్రత మహిమ మీ ముఖతః లోకానికి అందించడానికే అడిగాను. నావలె వేరెవరు ఈ వ్రతము నాచరించి పుణ్య ఫలమును పొందిరో చెప్పవలె’ నని ప్రార్థించెను. సదాశివుడు ఇతర సంఘటనలను చెప్ప నారంభించెను.

‹ ముందు అధ్యాయంతర్వాతి అధ్యాయం ›

భక్తి ఆరాధన యాప్ తెరవండి →