అనంత పద్మనాభ వ్రత కథ - అనంత పద్మనాభ వ్రతం - శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన వ్రతం
ద్వాపరయుగంలో దుర్యోధనాదులు మాయా జూదంలో పాండవులని ఓడించి అన్యాయంగా అడవికి పంపించారు. అంతటితో ఆగక, దూర్వాసుని ద్వారా పాండవులకి ఆపద కలిగించటానికి దుష్ట దుర్యోధనుడు ప్రయత్నించగా, శ్రీ కృష్ణుని దయవల్ల బయట పడ్డ పాండవులు, ఆ దేవదేవునికి నమస్కరించి, ‘ప్రభూ చేయని తప్పుకు ఇన్నేళ్ళుగా ఈ అడవిలో పడి ఉన్నాము, ఇన్ని కష్టాలు అనుభవిస్తూన్నాం, నీకు కరుణ కలుగలేదా? నీవే ఉపేక్షిస్తే మాకు దిక్కెవరు?’ అని దీనంగా అడిగారు.
అప్పుడు వాసుదేవుడు నవ్వి, ‘చింతింపకండి. నన్ను 14 లోకాలూ నిండిన అనంతుని స్వరూపంగా భావించి, ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతం చేస్తారో, వాళ్ళు సమస్తమైన కష్టాలనుంచీ నా అనుగ్రహంతో అతి తేలికగా బయట పడతారు. అభీష్ట సిద్ధికి ఇంతకన్నా తేలికైన మార్గం మరియొకటి లేదు. అలా చేస్తే మీ రాజ్యం మీకు తిరిగి లభించగలదు’ అని సెలవిచ్చి కృతయుగానికి సంబంధించిన ఈ కథ చెప్పాడు.