ఓంభక్తి ఆరాధన

రథసప్తమి

రథసప్తమి

స్నానం

రథసప్తమి ఉదయం రేగు, జిల్లేడు, చిక్కుడు ఆకులు తలపై పెట్టుకుని స్నానం చేయాలి. జిల్లేడు ఆకు ఒక్కటే దొరికినా దానితోనే స్నానం చేయాలి. నీళ్లు తలమీద నుంచి పోయాలి.
నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః
వరుణాయ నమస్తేఽస్తు హరివాససే నమోఽస్తు తే
యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు
తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ

“రథసప్తమి స్నానం జన్మజన్మల పాపాన్ని తొలగిస్తుంది.”

సూర్యార్ఘ్యం

స్నానం అయిన తరువాత సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి, ఆదివారం నిత్యపూజలోని సూర్య పూజ చేయాలి.
ఉషా ఛాయా పద్మినీ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః

“రథసప్తమి నాడు సూర్యనారాయణునికి అర్ఘ్యం ఇస్తాను.”

భక్తి ఆరాధన యాప్ తెరవండి →