నవరాత్రి 9వ రోజు - సిద్ధిదాత్రి
పూజా విధానం గురించి
నవరాత్రి 9వ రోజు సిద్ధిదాత్రిని ఆరాధించాలి.
ఈ రోజు దేవి – ధ్యాన శ్లోకం
సిద్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ
శ్రీ సిద్ధిదాత్ర్యై నమః
ధ్యాన ఆవాహనాది ఉపచారాన్ సమర్పయామి
(ఉపచారాల క్రమం ‘నవరాత్రి పూజ’ లో ఉన్నదే)
ప్రసాదం
నవదుర్గలని అనుసరించి చేసేవారు: పాయసాన్నం
విజయవాడ దుర్గమ్మ అలంకారాలని అనుసరించి చేసేవారు (రాజరాజేశ్వరి): శాకాన్నం
లలితా సహస్రనామాలని అనుసరించేవారు రోజూ వీటిలో ఏదో ఒకటి నివేదించవచ్చు (ఇది అన్నిటికన్నా శ్రేష్ఠమైన పద్ధతి): పాయసాన్నం (పాల పాయసం), స్నిగ్ధౌదనం (కట్టు పొంగలి), గుడాన్నం (బెల్లంతో చేసిన పాయసం), దధ్యన్నం (దధ్యోదనం), ముద్గౌదనం (పెసరపప్పు అన్నం), హరిద్రాన్నం (పులిహోర)