నవరాత్రి 8వ రోజు - మహాగౌరి
పూజా విధానం గురించి
నవరాత్రి 8వ రోజు మహాగౌరిని ఆరాధించాలి.
ఈ రోజు దేవి – ధ్యాన శ్లోకం
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవ ప్రమోదదా
శ్రీ మహాగౌర్యై నమః
ధ్యాన ఆవాహనాది ఉపచారాన్ సమర్పయామి
(ఉపచారాల క్రమం ‘నవరాత్రి పూజ’ లో ఉన్నదే)
ప్రసాదం
నవదుర్గలని అనుసరించి చేసేవారు: చక్రపొంగలి
విజయవాడ దుర్గమ్మ అలంకారాలని అనుసరించి చేసేవారు (మహిషాసుర మర్దిని): చింతపండు పులిహోర, పానకం, వడపప్పు
లలితా సహస్రనామాలని అనుసరించేవారు రోజూ వీటిలో ఏదో ఒకటి నివేదించవచ్చు (ఇది అన్నిటికన్నా శ్రేష్ఠమైన పద్ధతి): పాయసాన్నం (పాల పాయసం), స్నిగ్ధౌదనం (కట్టు పొంగలి), గుడాన్నం (బెల్లంతో చేసిన పాయసం), దధ్యన్నం (దధ్యోదనం), ముద్గౌదనం (పెసరపప్పు అన్నం), హరిద్రాన్నం (పులిహోర)