నవరాత్రి 7వ రోజు - కాళరాత్రి
పూజా విధానం గురించి
నవరాత్రి 7వ రోజు కాళరాత్రిని ఆరాధించాలి.
ఈ రోజు దేవి – ధ్యాన శ్లోకం
ఏకవేణీ జపాకర్ణ పూరా నగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికా కర్ణీ తైలాభ్యక్త శరీరిణీ
వామపాదోల్లసల్లోహ లతా కంటక భూషణా
వర్ధన మూర్ధ ధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ
శ్రీ కాళరాత్ర్యై నమః
ధ్యాన ఆవాహనాది ఉపచారాన్ సమర్పయామి
(ఉపచారాల క్రమం ‘నవరాత్రి పూజ’ లో ఉన్నదే)
ప్రసాదం
నవదుర్గలని అనుసరించి చేసేవారు: శాకాన్నం
విజయవాడ దుర్గమ్మ అలంకారాలని అనుసరించి చేసేవారు (దుర్గా దేవి): కదంబం అన్నం
లలితా సహస్రనామాలని అనుసరించేవారు రోజూ వీటిలో ఏదో ఒకటి నివేదించవచ్చు (ఇది అన్నిటికన్నా శ్రేష్ఠమైన పద్ధతి): పాయసాన్నం (పాల పాయసం), స్నిగ్ధౌదనం (కట్టు పొంగలి), గుడాన్నం (బెల్లంతో చేసిన పాయసం), దధ్యన్నం (దధ్యోదనం), ముద్గౌదనం (పెసరపప్పు అన్నం), హరిద్రాన్నం (పులిహోర)