నవరాత్రి 5వ రోజు - స్కందమాత
పూజా విధానం గురించి
నవరాత్రి 5వ రోజు స్కందమాతను ఆరాధించాలి.
ఈ రోజు దేవి – ధ్యాన శ్లోకం
సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ
శ్రీ స్కందమాత్రే నమః
ధ్యాన ఆవాహనాది ఉపచారాన్ సమర్పయామి
(ఉపచారాల క్రమం ‘నవరాత్రి పూజ’ లో ఉన్నదే)
ప్రసాదం
నవదుర్గలని అనుసరించి చేసేవారు: దధ్యోదనం
విజయవాడ దుర్గమ్మ అలంకారాలని అనుసరించి చేసేవారు (అన్నపూర్ణా దేవి + మహాలక్ష్మి): క్షీరాన్నం (లేక) పూర్ణాలు
లలితా సహస్రనామాలని అనుసరించేవారు రోజూ వీటిలో ఏదో ఒకటి నివేదించవచ్చు (ఇది అన్నిటికన్నా శ్రేష్ఠమైన పద్ధతి): పాయసాన్నం (పాల పాయసం), స్నిగ్ధౌదనం (కట్టు పొంగలి), గుడాన్నం (బెల్లంతో చేసిన పాయసం), దధ్యన్నం (దధ్యోదనం), ముద్గౌదనం (పెసరపప్పు అన్నం), హరిద్రాన్నం (పులిహోర)