నవరాత్రి 3వ రోజు - చంద్రఘంట
పూజా విధానం గురించి
నవరాత్రి 3వ రోజు చంద్రఘంటను ఆరాధించాలి.
ఈ రోజు దేవి – ధ్యాన శ్లోకం
పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా
శ్రీ చంద్రఘంటాయై నమః
ధ్యాన ఆవాహనాది ఉపచారాన్ సమర్పయామి
(ఉపచారాల క్రమం ‘నవరాత్రి పూజ’ లో ఉన్నదే)
ప్రసాదం
నవదుర్గలని అనుసరించి చేసేవారు: కొబ్బరి అన్నం
విజయవాడ దుర్గమ్మ అలంకారాలని అనుసరించి చేసేవారు (గాయత్రీ దేవి): దధ్యోదనం (లేక) కట్టు పొంగలి
లలితా సహస్రనామాలని అనుసరించేవారు రోజూ వీటిలో ఏదో ఒకటి నివేదించవచ్చు (ఇది అన్నిటికన్నా శ్రేష్ఠమైన పద్ధతి): పాయసాన్నం (పాల పాయసం), స్నిగ్ధౌదనం (కట్టు పొంగలి), గుడాన్నం (బెల్లంతో చేసిన పాయసం), దధ్యన్నం (దధ్యోదనం), ముద్గౌదనం (పెసరపప్పు అన్నం), హరిద్రాన్నం (పులిహోర)