ఓంభక్తి ఆరాధన

నవరాత్రి 2వ రోజు - బ్రహ్మచారిణి

నవరాత్రి 2వ రోజు - బ్రహ్మచారిణి

పూజా విధానం గురించి

నవరాత్రి 2వ రోజు బ్రహ్మచారిణిని ఆరాధించాలి.

ఈ రోజు దేవి – ధ్యాన శ్లోకం

దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలూ
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా

శ్రీ బ్రహ్మచారిణ్యై నమః
ధ్యాన ఆవాహనాది ఉపచారాన్ సమర్పయామి
(ఉపచారాల క్రమం ‘నవరాత్రి పూజ’ లో ఉన్నదే)

ప్రసాదం

నవదుర్గలని అనుసరించి చేసేవారు: పులిహోర
విజయవాడ దుర్గమ్మ అలంకారాలని అనుసరించి చేసేవారు (బాలా త్రిపుర సుందరి): నిమ్మకాయ పులిహోర
లలితా సహస్రనామాలని అనుసరించేవారు రోజూ వీటిలో ఏదో ఒకటి నివేదించవచ్చు (ఇది అన్నిటికన్నా శ్రేష్ఠమైన పద్ధతి): పాయసాన్నం (పాల పాయసం), స్నిగ్ధౌదనం (కట్టు పొంగలి), గుడాన్నం (బెల్లంతో చేసిన పాయసం), దధ్యన్నం (దధ్యోదనం), ముద్గౌదనం (పెసరపప్పు అన్నం), హరిద్రాన్నం (పులిహోర)

భక్తి ఆరాధన యాప్ తెరవండి →