నవరాత్రి 1వ రోజు - శైలపుత్రి
పూజా విధానం గురించి
నవరాత్రి 1వ రోజు శైలపుత్రిని ఆరాధించాలి.
ఈ రోజు దేవి – ధ్యాన శ్లోకం
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్
శ్రీ శైలపుత్ర్యై నమః
ధ్యాన ఆవాహనాది ఉపచారాన్ సమర్పయామి
(ఉపచారాల క్రమం ‘నవరాత్రి పూజ’ లో ఉన్నదే)
ప్రసాదం
నవదుర్గలని అనుసరించి చేసేవారు: పొంగలి
విజయవాడ దుర్గమ్మ అలంకారాలని అనుసరించి చేసేవారు (స్వర్ణాలంకృత కనక దుర్గ): బెల్లం పరమాన్నం, వడపప్పు, చలిమిడి
లలితా సహస్రనామాలని అనుసరించేవారు రోజూ వీటిలో ఏదో ఒకటి నివేదించవచ్చు (ఇది అన్నిటికన్నా శ్రేష్ఠమైన పద్ధతి): పాయసాన్నం (పాల పాయసం), స్నిగ్ధౌదనం (కట్టు పొంగలి), గుడాన్నం (బెల్లంతో చేసిన పాయసం), దధ్యన్నం (దధ్యోదనం), ముద్గౌదనం (పెసరపప్పు అన్నం), హరిద్రాన్నం (పులిహోర)