ఓంభక్తి ఆరాధన

కుమారీ పూజ

కుమారీ పూజ

పూజా విధానం గురించి

నవరాత్రుల్లో కుమారీని అమ్మవారి రూపంగా పూజించాలి. పాద్యం, అర్ఘ్యం, వస్త్రం, నైవేద్యం సమర్పించాలి.

కుమారీ పూజ గురించి

నవరాత్రుల్లో రోజుకి ఒక కుమారిని (బాలికని) అమ్మవారి రూపంగా భావించి పూజించాలి. ఏ రోజు ఏ వయస్సు బాలికని, ఏ పేరుతో, ఏ మంత్రంతో పూజించాలో, దాని ఫలితం ఏమిటో ఈ క్రింద ఇవ్వబడింది.

1వ రోజు – కుమారి (2 సంవత్సరాలు)

కుమారస్య చ తత్త్వాని యా సృజత్యపి లీలయా
కాదీనపి చ దేవాన్ తాం కుమారీం పూజయామ్యహం

ఫలితం: దారిద్ర్య నాశనం, దీర్ఘాయువు

2వ రోజు – త్రిమూర్తి (3 సంవత్సరాలు)

సత్త్వాదిభిః త్రిమూర్తిర్యా తైర్హి నానా స్వరూపిణీ
త్రికాల వ్యాపినీ శక్తిః త్రిమూర్తిం పూజయామ్యహం

ఫలితం: పుత్ర పౌత్ర వంశాభివృద్ధి

3వ రోజు – కల్యాణి (4 సంవత్సరాలు)

కల్యాణకారిణీ నిత్యం భక్తానాం పూజితాఽనిశం
పూజయామి చ తాం భక్త్యా కల్యాణీం సర్వకామదాం

ఫలితం: విద్యాభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతి

4వ రోజు – రోహిణి (5 సంవత్సరాలు)

రోహయంతీ చ బీజాని ప్రాగ్జన్మ సంచితాని వై
యా దేవీ సర్వభూతానాం రోహిణీం పూజయామ్యహం

ఫలితం: సర్వ రోగ నివారణ

5వ రోజు – కాళిక (6 సంవత్సరాలు)

కాళీ కాలయతే సర్వం బ్రహ్మాండం సచరాచరం
కల్పాంత సమయే యా తాం కాళికాం పూజయామ్యహం

ఫలితం: శత్రు నాశనం

6వ రోజు – చండిక (7 సంవత్సరాలు)

చండికాం చండరూపాం చ చండముండ వినాశినీం
తాం చండపాపహరిణీం చండికాం పూజయామ్యహం

ఫలితం: అష్టైశ్వర్యాలు

7వ రోజు – శాంభవి (8 సంవత్సరాలు)

అకారణాత్ సముత్పత్తిర్యన్మయైః పరికీర్తితా
యస్యాస్తాం సుఖదాం దేవీం శాంభవీం పూజయామ్యహం

ఫలితం: విపరీతమైన ఆకర్షణ శక్తి

8వ రోజు – దుర్గ (9 సంవత్సరాలు)

దుర్గాత్ త్రాయతి భక్తం యా సదా దుర్గతి నాశినీ
దుర్జ్ఞేయా సర్వదేవానాం తాం దుర్గాం పూజయామ్యహం

ఫలితం: సంసారం నుంచి జ్ఞానం వైపుకి త్రోవ

9వ రోజు – సుభద్ర (10 సంవత్సరాలు)

సుభద్రాణి చ భక్తానాం కురుతే పూజితా సదా
అభద్ర నాశినీం దేవీం సుభద్రాం పూజయామ్యహం

ఫలితం: భయాన్ని పోగొట్టి భద్రతని కలిగిస్తుంది

భక్తి ఆరాధన యాప్ తెరవండి →