శ్రీవారి హారతులు
వెంగమెంబ గారి ముత్యాల హారతి
శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకూ

ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన మా పాలి అలమేలుమంగమ్మకూ ....

జయమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం

శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరియించియున్న పర దైవమునకూ

మరువ వలదీ బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మంగమ్మకూ ...

జయమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం

ఆనందనిలయమందనిశంబు వసియించి దీనులను రక్షించు దేవునకునూ

కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలిమేలు మంగమ్మకూ....

జయమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం

వరమొసగ నా వంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకునూ

సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకూ....

జయమంగళం నిత్య శుభమంగళం

జయమంగళం నిత్య శుభమంగళం

తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళిగించి గైకొనెడి అచ్యుతునకూ

ఎలమి పాకంబు జేయించి అందరకన్న మలయకెపుడొసగె మహామాతకూ.....

జయమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం

మరియు చిత్రవిచిత్ర మంటపావళులకును తిరువీధులకు దివ్య తీర్థములకూ

పరగ కనగోపుర ప్రాకారతతులకును చిరములైతగు కనక శిఖరములకూ....

తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప భరిత శృంగారవన పంక్తులకునూ

మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులగు పాకాశాలలకునూ

అహి వైరి ముఖ్యవాహనములకు గొడుగులకు రహినొప్పు మకరతోరణములకునూ

బహువిధ ధ్వజములకు పటు వాద్య వితతులకు విహిత సత్కళ్యాణ వేదికలకూ....

జయమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం

దర చక్ర ముఖ్య సాధనములకు, మణిమయాభరణ దివ్యాంబర ప్రతతులకునూ

కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభకరమైన దివ్య మంగళ మూర్తికి

జయమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం

కలిత సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పునమిత ప్రభావమునకునూ

వలగొనిన సకలపరివార దేవతలకును చెలగి పనులొనరించు సేవకులకూ...

జయమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం

అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకునూ

పొలుపొందు విశ్వప్రభుత్వఉల్లంబునకు నలువొందు వర విమానంబులకునూ..

జయమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం

అరయ తరిగొండ నరహరియగుచు నందరికి వరములొసగే శ్రీనివాసునకునూ

మురియుచును విశ్వతోముఖునిట్లు భరియించి సిరుల వెలయుచునుండు శేషాద్రికీ....

జయమంగళం నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం